కిన్నెర మెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్యను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఘనంగా సన్మానించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ఈ రోజు హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో.. మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ..మొగిలయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ.. వారిని ఆదుకుంటారన్నారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తుందన్నారు. హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం ఒక కోటి రూపాయలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చారని అన్నారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్యకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో.. మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement