Friday, November 22, 2024

హాస్ప‌ట‌ల్స్ లో ఆక్సిజెన్ కొర‌త‌….

హైద‌రాబాద్ – కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ ట్రీట్‌మెంట్‌ అవసరమయ్యే కోవిడ్‌ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో సాధారణ కోవిడ్‌ బెడ్లు ఖాళీగా ఉంటున్నా… ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు మాత్రం నిండిపోతున్నాయి. మొదటి వేవ్‌ సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్లపై 2.,4శాతం పేషెంట్లు చేరితే… సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే 4.5శాతం పేషెంట్లు ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడుతున్న వారిలో ఆక్సిజన్‌ నిల్వలు పడిపోతున్నాయి. సాధారణంగా శరీరంలో ఆక్సిజన్‌ సాచురైజేషన్‌ 94శాతం దాకా ఉండాలి. అయితే కోవిడ్‌ పేషెంట్లలో ఈ ఆక్సిజన్‌ శాతం 94శాతం కన్నా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పరిస్థితి మరింత ముదరకుండా వైద్యులు ఆక్సిజన్‌ చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా ప్రయివేటు ఆస్పత్రుల్లోని 5813 ఆక్సిజన్‌ బెడ్లకు గాను 3294 బెడ్లపై, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6044 ఆక్సిజన్‌ బెడ్లకు గాను 1643 బెడ్లు పేషెంట్లతో నిండిపోయాయి. కోవిడ్‌ వైరస్‌ ఎక్కువగా ఊపరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుండడంతో ఆక్సిజన్‌ లెవల్స్‌ త్వరగా పడిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ పేషెంట్లు తరచూ ఆక్సీమీటర్‌ సాయంతో తమ ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

ఆక్సిజెన్ కొర‌త ఉంది …..
తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అయితే ఆక్సిజ న్‌కు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ను వృథా చేయకుండా పటిష్టమైన నిఘా ఉంచామన్నారు. రాష్ట్రం లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ, 144 సెక్షన్‌లు పెట్టే అవకాశం లేదన్నారు. అయితే అవసరం ఉంటేనే ప్రజలకు బయ టకు రావాలని సూచించారు. కరోనా చికిత్సకు అధిక ఫీజు లు వసూలు చేస్తే చర్యలు తప్పవని ప్రయివేటు ఆస్ప త్రులను హెచ్చరించారు. ఈ కరోనా విపత్కర సమ యాల్లో ప్రయివేటు ఆస్పత్రులు మానవత్వంతో వ్యవ హరించాలన్నారు. రోగుల నుంచి డబ్బులు దండు కోవడమే పనిగా పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 25ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకా డోస్‌లు పంపించాలని విన్నవించినట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement