రాష్ట్రానికి కావాల్సింది రోజుకు 384 టన్నులు.. వచ్చేది 260 టన్నులు
వరంగల్‌లో ఆక్సిజన్ బాధ్యత రోగులదే
సిలిండర్ వెంట తెచ్చుకోవాల్సిందే
హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అదే తీరు..
ఆక్సిజన్ ఛార్జీలు మరింత పెంపు
కేసులు పెరిగితే.. ఆక్సిజన్ కష్టాలు తీవ్రం
హైదరాబాద్, : ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఇపుడు ప్రాణవాయువు దక్కక జనం పిట్టల్లా ప్రాణాలొదిలేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడ్డ ఆక్సిజన్ కొరత తెలంగాణనూ వేధి స్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, ఎప్పటికపుడు ప్రభుత్వం దీనిని పర్యవేక్షిస్తున్నదని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అయితే ప్రాణవాయువు కొరత తీవ్రంగా ఉందని.. ప్రతిరోజూ రాలిపోతున్న ప్రాణా లు, కూలిపోతున్న కుటుంబాలు, అంబులెన్స్‌లలో.. ఆస్ప త్రులలో విగతజీవులుగా మారుతున్న కరోనా బాధితులు దుష్టాంతాలు చెబుతున్నాయి. గాంధీలో కూడా ఐసీయు బెడ్లు.. ఆక్సిజన్ బెడ్లు దొరకని పరిస్థితి ఉండగా, జిల్లా కేంద్రా ల్లోని ఆస్పత్రుల్లోనూ.. ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడుతుండగా, అనేక ఆస్పత్రులలో అక్సిజన్ మీరు తెచ్చుకోవాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. కొన్ని ఆస్పత్రులు ఇదే అదనుగా ఆక్సిజన్ సర్ ఛార్జ్ అదనంగా బాదేస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో వరంగల్ లోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ మీరే తెచ్చు కోవాలని రోగులకు చెప్పేస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్ ఉత్ప త్తి ఉన్నా.. సరఫరా, పంపిణీలో ప్రణాళికాలోపం ప్రజల పాలిటశాపంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.
గిలగిలాకొట్టుకుంటున్న ప్రాణాలు
ఆక్సిజన్ అందక ప్రాణాలు గిలాగిలా కొట్టుకుం టున్నా యి. తెలంగాణకు 384టన్నుల ఆక్సిజన్ ప్రతిరోజూ అవసరం కాగా, సరఫరా మాత్రం కేవలం 260 నుండి 270 టన్నులు మాత్రమే ఉంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్న పరి స్థితుల్లో ఆక్సిజన్ అవసరం మరింత పెరుగుతుండగా, కేటా యింపులు చేసిన రాష్ట్రాల్లోని ప్లాంట్ల నుండి కూడా.. అక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలు అభ్యం తరం చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రా ల్లోనూ ఆక్సిజన్ ఆర్తనాదాలు తీవ్రస్థాయిలో ఉండగా, కరోనా తొలివేవ్‌లో ఆక్సిజన్ అందక పెద్దసంఖ్యలో పోయిన ప్రాణాలను వీడియోల రూపంలో బాధితులే పంపిన సంఘ టనలు ఉన్నాయి. ఇపుడు అంతకంటే హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరతలేదని, కేంద్రం తీరుతో.. కొరత ఏర్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆక్సి జన్ కొరతకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడడంతో కొరత శాపంగా మారింది. స్థానికంగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. తొలివేవ్ కంటే సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా.. ఐదుకేజీలు, పదికేజీల సిలిండర్లు కూడా బాధితుల కుటుంబసభ్యులు బ్లాక్‌లో కొంటున్న పరి స్ధితి నెలకొంది. కరోనా బాధితులకు ఆక్సిజన్ లెవెల్స్ పడి పోతుండగా, ఆక్సిజన్ సరఫరా ఎక్కువమందికి అని వార్యమైంది. దీంతో ఇన్ పేషంట్లుగా చేరేవారికి ప్రాణ వాయువు అక్సిజన్‌తో ప్రాణం పోయాల్సిన పరిస్థితి నెల కొంది. మృతుల్లో ఎక్కువమంది ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందని ఫలితంగానే చనిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో జనం భయకంపితులవుతుండగా, ఓవైపు మందుల కొరత.. మరోవైపు ఆక్సిజన్ కొరత ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణవాయువు కొరత తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.