ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఉప్పల్ డివిజన్ లో పలు ప్రాంతాల్లో వరద, డ్రైనేజీ సమస్య ఏర్పడింది. ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతటితో ఆగకుండా రజితపరమేశ్వర్ రెడ్డి స్వయంగా ఉప్పల్ లోని సౌత్ స్వరూప్ నగర్, గాంధీనగర్, ఇందిరా నగర్ కాలనీల్లో పర్యటించి పొంగుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కారమయ్యేలా సిబ్బందితో పనులను చేయించారు.
రూ.40 లక్షలతో పనులు :
సౌత్ స్వరూప్ నగర్ లో ట్రంక్ లైన్ మ్యాన్ హోల్ పగిలి పోవడంతోనే గాంధీ నగర్, సౌత్ స్వరూప్ నగర్ ,ఇందిరా నగర్ కాలనీలలో డ్రైనేజీ సమస్య ఏర్పడిందని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.40 లక్షల నిధులను మంజూరు చేయించినట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, సౌత్ స్వరూపనగర్ కాలనీ ప్రెసిడెంట్ గజాల వెంకట్ రెడ్డి, తాటికొండ రమణ, జంగయ్య, సల్ల ప్రభాకర్ రెడ్డి, బాకారం అరుణ్, తోకట రాజు, పాలడుగు లక్ష్మణ్, జీవన్, రాఘవేందర్, హనుమంత్, ప్రేమ్, గంజాయి నర్సింగ్, కృష్ణ, గంజాయి మహేష్, పాలది విజయ్, తదితరులు పాల్గొన్నారు.