Thursday, December 12, 2024

HYD | మన సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవి.. మాజీ మంత్రి త‌ల‌సాని

విదేశీయులు కూడా ఆచరిస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం రవీంద్రభారతి లోని మినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరై SR నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు డ్యాగ బాలరాజ్ యాదవ్ 700 శ్లోకాలతో కూడిన భగవద్గీత కు అదనంగా మరో 45 శ్లోకాలను చేర్చి మొత్తం 745 శ్లోకాలతో కూడిన కర్మ, భక్తి, జ్ఞాన విభాగాలతో రూపొందించిన శ్రీ మద్బగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాల ద్వారా మన చరిత్ర ను తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు. వేల సంవత్సరాల నాటి అనేక రకాల చరిత్రను పుస్తకాల రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తున్న కవులు, రచయిత లకు అభినందనలు తెలిపారు.

సుమారు ఒక సంవత్సరం పాటు శ్రమించి పుస్తకాలను రూపొందించిన బాలరాజ్ యాదవ్ ను అభినందించారు. నేటి తరం యువతలో అనేకమందికి మన పండుగల విశిష్టతలు, ఆచారాలు తెలవకపోవడం విచారకరం అన్నారు. దేశ, విదేశాలలో మన పండుగలను గొప్పగా జరుపుకోవడం, మన ఆచారాలను అనేక సందర్బాలలో పాటిస్తుండటం మనకు ఎంతో గర్వకారణం అన్నారు. పెండ్లి, ఇతర శుభకార్యాలలో కూడా వాస్తవంగా మన పద్ధతులకు బదులుగా పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలను గతంలో ఎంతో గొప్పగా జరుపుకొనే వారని, కానీ నేడు పండుగల సందర్బంలో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా మన చరిత్ర, సాంప్రదాయాలను తెలియజెప్పే పుస్తకాలను చదవాలని, మన సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

అనంతరం బాలరాజ్ యాదవ్ ను MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత తెలుగు శాఖా అద్యక్షులు చెన్నప్ప, ఆచార్య కసిరెడ్డి, విశ్రాంత సంస్కృత పండితులు జగన్నాధ శాస్త్రి, ధర్మదాత, ప్రముఖ రచయిత్రి లావణ్య, గీత ప్రచారకర్త పూర్ణ, ప్రముఖ చిత్రకారుడు కృష్ణస్వామి, SR నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ అద్యక్షుడు దూబే, మాజీ అద్యక్షులు మాణిక్ రావ్ పాటిల్, పార్ధ సారధి, సభ్యులు RC కుమార్, JST సాయి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement