ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవ్వాల (సోమవారం) కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలు (CPGET) 2022 మొదటి దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సవరించింది, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15 అని వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, ధృవీకరణ వివరాలు అక్టోబర్ 18న అందుబాటులో ఉంటాయి.
అభ్యర్థులు అక్టోబరు 19, 21 మధ్య వెబ్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 26న సీట్లు తాత్కాలికంగా కేటాయించబడతాయి. అభ్యర్థులు అక్టోబర్ 31లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించండి.