హైదరాబాద్: మహానగరంలో తమ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఓఎన్డీసీ వేదికలో అభివృద్ధి చేసిన స్థానిక షాపింగ్ యాప్ పిన్కోడ్ ప్రకటించింది. హైదరాబాద్లోని వినియోగదారులు ఇప్పడు పిన్కోడ్లో తమకు వచ్చిన స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లన్నిటి నుండి కిరాణా సరకులు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వీలవుతుంది.
ఈసందర్భంగా పిన్కోడ్ జనరల్ మేనేజర్ లలిత్ సింగ్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో తమ సేవలు ప్రారంభించడం తమకు ఎంతో ఉత్కంఠగా ఉందన్నారు. తొలి నాళ్లలో లభించిన స్పందన, వేగవంతంగా వినియోగదారులు పిన్కోడ్ ను స్వీకరించడం తమ సేవలను విస్తరించడానికి అవసరమైన నమ్మకాన్ని తమకు కలుగజేసిందన్నారు. స్థానిక విక్రేతలను విజేతగా నిలపాలని, అలాగే తమ వినియోగదారులకు ఒక విశిష్ఠమైన షాపింగ్ అనుభవాన్ని అందించాలని తాము కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. స్థానిక దుకాణాలకు డిమాండ్ ను తీసుకురావడం కోసం ఉత్సాహ పూరితమైన వినియోగదారు ఆఫర్లను కూడా తాము ఆవిష్కరించనున్నామన్నారు. రాబోయే నెలల్లో మరిన్ని నగరాలకు విస్తరించేందుకు అవసరమైన ఆశయాత్మక ప్రణాలికలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు.