కేసీఆర్ సీఎం అయిన తర్వాత సినిమా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో పైడి జయరాజ్ వారి ఆధ్వర్యంలో లక్నవరం గెస్ట్ హౌస్ ప్రివ్యూ షోకి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిత్ర రంగానికి అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు సినిమా రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో సినిమా రంగానికి, పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత కేసీఆర్ దేనన్నారు.
తెలంగాణలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, రామప్ప, లక్నవరం, సోమశిల, బోనగిరి ఖిల, గోల్కొండ, బిర్లా మందిర్, నాగార్జున సాగర్, వేయి స్తంభాల దేవాలయం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సినిమా షూటింగ్ లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్ అయిలు రమేష్, ప్రేమ్ రాజ్, సాయి కిరణ్ కర్య అసంపల్లి శ్రీనివాస్, రాజు ఇనుముల, డీఓపీ శివ బత్తుల, ఉదయ్ కుమార్, జూనియర్ పవన్ కళ్యాణ్, ముక్కెర రమేష్, నటీనటులు సాయితేజ, నిహారిక, దేవికృతి, రాజు, సినిమా యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.