Friday, November 22, 2024

HYD: చిన్న వ్యాపారాల భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టిన ఓఎన్డీసీ, మెటా

హైద‌రాబాద్ : ఓఎన్డీసీ-మెటా భాగస్వామ్యంతో చిన్న వ్యాపారాలు డిజిటల్ వాణిజ్య శక్తిని అన్‌లాక్ చేయడంలో సహాయపడటమే కాక మెటా వారి వ్యాపార సాంకేతిక పరిష్కార ప్రదాతల పర్యావరణ వ్యవస్థ నందు వాట్సాప్‌ ద్వారా కొనుగోలుదారు, విక్రేతల మధ్య అనియత సంభాషణ అనుభవాలను రూపొందించేలా వారికి అవగాహన కల్పించటం జరుగుతుంది.

ఈసందర్భంగా ఓఎన్డీసీ ఎండీ అండ్ సీఈఓ టీ కోశి మాట్లాడుతూ… ఓఎన్డీసీలో డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను వేగవంతం చేయడానికి ప్రజాస్వామ్యీకరించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే ఆ కోణంలో ఎంఎస్ఎంఈ లను శక్తివంతం చేయడం, డిజిటల్ దృశ్యమానతను పెంపొందించడం ఇంకా వారి వ్యాపారాలను పెంచడం అనేవి తమ లక్ష్యాలన్నారు.

భారతదేశపు మెటా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ మాట్లాడుతూ… భారతదేశ డిజిటల్ పరివర్తన కథ శరవేగంతో సాగుతోందన్నారు. ఈ వృద్ధి కొనసాగాలంటే మిలియన్ల కొద్దీ చిన్న వ్యాపారాలు తమ డిజిటల్‌ ఉనికిని సృష్టించుకోవటానికి దానిని మరింతగా పెంచుకోవడానికి సరైన వాతావరణం అలాగే భాగస్వామ్యం అవసరమన్నారు. ముఖ్యంగా భారతదేశం అంతటా ఎంఎస్ఎంఈ ల డిజిటల్ చేరికను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం, పరిశ్రమలతో భాగస్వామ్యం చేయడంలో మెటా ముందుందన్నారు. ఓఎన్డీసీ తో తమ భాగస్వామ్యం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement