Sunday, January 5, 2025

Objection – చదువుల ఆల‌యానికి వీర సావర్క‌ర్ పేరు…తీవ్ర అభ్యంత‌రం తెలిపిన సిపిఐ నారాయ‌ణ‌

హైద‌రాబాద్ – చదువుల దేవాలయానికి హిందూత్వ వాదానికి ఆద్యుడైన వీర‌ సావర్క‌ర్ పేరు పెట్టడం పూర్తి అభ్యంతరకరమని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయణ అన్నారు. మతాన్ని ఆధారంగా సమాజాన్ని విభజించే వాదాన్ని ప్రేరేపించి, భారత స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో గాంధీ అహింసాయుత క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన సావర్క‌ర్ పేరు పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఈ మేర‌కు అయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌ను నేడు విడుద‌ల చేశారు.

దేశ రాజధానిలో అవతరించే విద్యల ఆలయానికి పెట్టాల్సిన పేరు ఇదేనా..? అంటూ మండిపడ్డారు. సెక్యులర్ భావాలు, సర్వమత సమాధికారం అనేవి భారతసమాజపు విలువలకు వెన్నెముక వంటివి అని నారాయణ పేర్కొన్నారు. వాటిని వ్యతిరేకించి ఉద్యమాలు చేసి, చివరకు మహాత్ముని హత్య కేసులో కూడా ఒక నిందితుడిగా అనుమానించబడ్డ సవార్కర్ పేరా సరస్వతీ నిలయానికి పెట్టాల్సిన పేరా..? అదేనా అంటూ ప్రశ్నించారు. చూసి చూడకుండా ఉంటే గాడ్సే పేరును కూడా ఏ విశ్వవిద్యాలయాలకో ఉన్నత సంస్థలకో కూడా పెట్టే అఘాయిత్యానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగలదని భ‌యందోళ‌న‌లు వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement