భారతదేశంలో ఆహార భద్రత దిశగా కృషి చేస్తున్న వేళ మనమంతా కూడా న్యూట్రిషన్ భద్రతకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉందని వీట్ ప్రొడక్ట్స్ ప్రొమోషన్ సొసైటీ (డబ్ల్యుపీపీఎస్) ఛైర్మన్ అజయ్ గోయల్ అన్నారు. వీట్ ప్రొడక్ట్ప్ ప్రొమోషన్ సొసైటీ (డబ్ల్యుపీపీఎస్), హైదరాబాద్లో హెల్త్ అండ్ వెల్నెస్ కోసం గోధుమలు, గోధుమ ఉత్పత్తులపై విజయవంతంగా ఓ సదస్సును కో–ఆర్గనైజర్లు, కో–స్పాన్సర్లు, నాలెడ్జ్ భాగస్వాములు, అసోసియేట్ పార్టనర్స్, ఇండస్ట్రీ సపోర్టర్ల మద్దతుతో నిర్వహించింది. కొవిడ్ కారణంగా పలు సంవత్సరాల విరామం తరువాత భౌతికంగా నిర్వహించిన మొట్టమొదటి సెమినార్గా ఇది నిలిచింది.
ఈసందర్భంగా అజయ్ గోయల్ మాట్లాడుతూ… గోధుమ ఆధారిత ఆహారంలో మ్యాక్రో మయు మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయన్నారు. ఈ సెమినార్ ద్వారా ఆ సామర్థ్యంను వెల్లడించే దిశగా అతిముఖ్యమైన ముందడుగు వేస్తున్నామన్నారు. భారతదేశంలో గోధుమ పరిశ్రమ వైవిధ్యమైనదని, అత్యంత శక్తివంతమైనదన్నారు. భారీ, చిన్నతరహా ఉత్పత్తిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు ఆధారపడ్డాయన్నారు. న్యూట్రిషన్, హెల్త్, సౌకర్యం కోసం మారుతున్న వినియోగదారుల అవసరాలను మనం అందుకోవాల్సి ఉందన్నారు.