Tuesday, November 19, 2024

NSDC: సదస్సులతో గ్లోబల్ టాలెంట్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నఎన్ఎస్ డిసి

హైదరాబాద్ : భారతదేశాన్ని అంతర్జాతీయ నైపుణ్య కేంద్రంగా నిలబెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిర్దేశించిన దూరదృష్టి లక్ష్యానికి అనుగుణంగా, నేషనల్ స్కిల్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ ఇటీవల రెండు ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించింది. శక్తివంతమైన నగరాలైన ఒసాకా, టోక్యోలోని బిజినెస్ మ్యాచ్ మేకింగ్ సెమినార్లు వీటిలో ఉన్నాయి. ఈ సదస్సులు గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో భారతీయ అభ్యర్థుల అపారమైన సామర్ధ్యాల గురించి సంబంధితులకు, పరిశ్రమల నాయకులకు తెలియచేయడానికి ఒక కీలక వేదికగా పనిచేశాయి. ఈ సదస్సులకు నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్ షిప్ మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారతదేశంలోని జపాన్ రాయబార కార్యాలయంతో సహా కీలక ప్రభుత్వ సంస్థల నుండి విలువైన మద్దతు లభించింది.

ఈసందర్భంగా ఎన్‌ఎస్‌డిసి సిఇఓ, ఎన్‌ఎస్‌డిసి ఇంటర్నేషనల్ ఎండి వేద్ మణి తివారీ మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అవసరాలకు భారతదేశం గణనీయంగా దోహదపడే అవకాశం ఉందని తాము దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు. తమ అభ్యర్థులు జపాన్‌లోని వివిధ పరిశ్రమల డిమాండ్‌లను తీర్చడానికి సన్నద్ధమయ్యారన్నారు. సహకార ప్రయత్నాల ద్వారా తాము ప్రతిభకు తిరుగులేని మార్పిడిని అందించగలమన్నారు. భారతదేశం, జపాన్ మధ్య ఈ భాగస్వామ్యం పరస్పర వృద్ధి, అభివృద్ధికి అపారమైన అవకాశాలను కలిగి ఉందన్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్‌లో బలమైన, ఫలవంత మైన సంబంధాన్ని పెంపొందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement