హైదరాబాద్ : గత వారం లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ బ్రాండ్ నథింగ్, ప్రపంచానికి తమ ఫోన్ (2)ని పరిచయం చేసింది. నథింగ్ డ్రాప్స్‌కి విచ్చేసిన కమ్యూనిటీ, మీడియా, హాజరైన అతిథుల నుండి అపూర్వ స్పందన అందుకుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్ల ద్వారా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి భారతదేశంలో ఓపెన్ సేల్స్ ప్రారంభమవుతాయని సంస్థ గుర్తు చేస్తుంది. నథింగ్ ఓఎస్ కోసం నథింగ్ ఐకాన్ ప్యాక్‌తో వినియోగదారులు ఇప్పుడు తమ ఫోన్ (2) రూపాన్ని పూర్తి చేయవచ్చు. కనీస మోనోక్రోమ్ లుక్ ను ఫోన్‌తో వున్నప్పుడు ఇతర అంశాలపై తక్కువ దృష్టి సారించటంతో పాటుగా మరింత ఉద్దేశపూర్వకంగా ఉండేలా చేయడానికి రూపొందించబడింది.
ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఫోన్ (1) వినియోగదారులు ఆగస్టు చివరిలో వచ్చే నథింగ్ ఓఎస్ 2.0, సాఫ్ట్వేర్ అప్డేట్తో ఐకాన్ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఫోన్ (2) తెలుపు, ముదురు బూడిద రంగులో అందుబాటులో ఉంది. వీటిని ఎంచుకోవడానికి క్రింది రకాలలో లభ్యమవుతుంది. ప్రీ-ఆర్డర్ పాస్ కొనుగోలుదారుల కోసం పరిమిత వ్యవధి ఆఫర్లో ఇవి ఉన్నాయి. తక్షణ తగ్గింపు రూ.3000 యాక్సిస్, హెచ్ డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌పై, ఫోన్ (2) కేస్ రూ. 499, స్క్రీన్ ప్రొటెక్టర్ రూ. 399, పవర్ (45డబ్ల్యూ) అడాప్టర్ రూ. 1,499, ఇయర్ (స్టిక్) రూ. 4,250 కు పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.