Sunday, November 24, 2024

HYD: సి-డాక్ తో నార్డెన్ కమ్యూనికేషన్ భాగస్వామ్యం..

హైదరాబాద్: భద్రతా అవసరాలు, ఇతర పారిశ్రామిక వినియోగాల కోసం ఏఐ- ఆధారిత సాధారణ ప్రయోజన థర్మల్ కెమెరాలను అభివృద్ధి చేయడానికి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్)తో ఒప్పందం చేసుకున్నట్లు నార్డెన్ కమ్యూనికేషన్ వెల్లడించింది. ఈసందర్భంగా నార్డెన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ – ఇండియా అండ్ సార్క్ ప్రశాంత్ ఒబెరాయ్ మాట్లాడుతూ… ఈ భాగస్వామ్యం మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంలో భాగంగా జాతీయ భద్రత పట్ల అచంచలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తుందన్నారు.

నిఘా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా నిలుస్తుందన్నారు. ఎక్ట్ర్సా- లో వోల్టేజ్ (ఈఎల్వీ) సొల్యూషన్‌ల తయారీ, పంపిణీలో నైపుణ్యం కలిగిన నార్డెన్, నిఘా సాంకేతికత రంగంలో సి-డాక్ లక్ష్యంకు అనుగుణంగా పనిచేస్తుంది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ (టీఓటీ) భాగస్వామిగా, నేషనల్ హైవే, డిఫెన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లలో జనరల్-పర్పస్ థర్మల్ కెమెరా ఉత్పత్తి, మార్కెటింగ్, విక్రయం, అమలుకు నార్డెన్ కట్టుబడి ఉంది. ఈ రంగంలో ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 30శాతం ఉత్పత్తిని ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement