హైదరాబాద్, కరోనా రోగులకు చికిత్సను అందించే సర్కారు ఆసుపత్రుల్లో పడకల కొరతలేదని, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే బెడ్స్ కొరత ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్కే భవన్లో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా తగ్గింద నుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైం దన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు, 45 సంవత్స రాలు నిండిన ప్రతి ఒక్కరికీ 100 శాతం టీకాలు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని తెలిపారు. సరిహద్దుల్లో ఉన్న వారు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచిం చారు. టీకాలు లేక రాష్ట్రంలో ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. 2.7 లక్షల టీకా డోసులు రాష్ట్రానికి వస్తాయని ఆయన వెల్లడించారు. రోజుకు 10 లక్షల టీకాలు వేసే సామ ర్థ్యం తెలంగాణ వైద్య సిబ్బందికి ఉందని, దానికను గుణంగానే టీకాలు సరఫరా చేయాలని ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
టీకాల సమస్యను, ఆక్సిజన్ కొరతను కేంద్రం త్వరగా పరిష్కరించాలని మంత్రి కోరారు. తెలంగా ణలో ఆక్సిజన్ కొరత అంతగా లేదని వెల్లడించారు. రోగి అవసరాన్ని బట్టి ఆక్సీజన్‌ను అందించాలని, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉందని ఆయన సూచించారు. సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్ సరఫరా విషయంపైన కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటి కప్పుడు చర్చలు జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చని తెలిపారు. ఆక్సిజన్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలని మంత్రి సూచించారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రెమిడెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి తగ్గిందని, త్వరలో కావాల్సినన్ని ఇంజెక్షన్లు లభిస్తాయని తెలిపారు. వైరస్ సోకిన 3 నుంచి 4 రోజులకు లక్షణాలు కనిపిస్తాయని, లక్షణాలు కనిపించకపోవడం వల్లే ఇతరులకు త్వరగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అనవసరంగా అందరికీ రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వొద్దని, చివరి అస్త్రంగా మాత్రమే దానిని ఇవ్వాలని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
అందుబాటులో 60వేల కొవిడ్ బెడ్స్…. మంత్రి ఈటల…
Advertisement
తాజా వార్తలు
Advertisement