హైదరాబాద్ : రాష్ర్టంలో విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యుత్ ఛార్జీల విషయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ, కరోనా సంక్షోభ సమయంలో విద్యుత్ సంస్థలకు నష్టాలు వచ్చాయని, అయినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచే ఆలోచన లేదని వెల్లడించారు. కొవిడ్ సందర్భంలో బిల్లులు ఎక్కువ వచ్చాయని చెప్పడం నిరాధారమన్నారు. సాంకేతిక లోపం కారణంగానే కొన్ని చోట్ల బిల్లులు అధికంగా వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఆ తర్వాత ఆ బిల్లులను సరిదిద్దామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement