Tuesday, November 26, 2024

ఆ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు వద్దు.. జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం

వికారాబాద్‌, ప్రభన్యూస్ : జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసి) ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపై తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో మొదటి ఏడాది ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు ఎన్‌ఎంసి ప్రకటించింది. ఈ జాబితాలో జిల్లాలోని వికారాబాద్‌లో ఉన్న మహవీర్‌ మెడికల్‌ కాలేజీతో పాటు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు టి.రామ్మో హన్‌రెడ్డి(టిఆర్‌ఆర్‌)కు చెందిన టిఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ(పటాన్‌చెరు) కూడా ఉంది. గతంలో కూడా మహవీర్‌ కాలేజీపై చర్యలు తీసుకున్నా పనితీరులో మార్పు రాకపోవడం గమనార్హం. నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ కాలేజీపై రెండు మార్లు చర్యలు తీసుకున్నారు. మహవీర్‌ కాలేజీపై సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రూ.2 కోట్ల జరిమానా విధించింది. దీనిని బట్టి ఈ కాలేజీలో వసతులు.. బోధన.. వైద్య సేవల కొరత ఎంతగా ఉందో స్పష్టమ వుతోంది. ఇక టిఆర్‌ ఆర్‌ కాలేజీపై చర్యలతో డిసిసి అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి షాక్‌కు గురయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement