హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల రోజు నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. జూబ్లీహిల్స్‌లో ఆరు పబ్బులపై కేసులు నమోదు చేశారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు నడిచిన హలో, టార్, గ్రీన్ మంకిస్, మకవ్, లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదయ్యాయి.
నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను పబ్ నిర్వాహకులు లెక్కచేయలేదు. అధిక డీజే సౌండ్‌తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు. భారీ శబ్ధాలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదైంది.