హైదరాబాద్, : మారిన వాతావరణ పరిస్థి తులు..పెరుగుతున్న ఎరువుల వినియోగంతో కూరగాయలు మంచి కంటే చెడు చేస్తున్నాయన్న ఆలోచనల్లోంచి పుట్టి నవే..టెర్రస్గార్డెన్స్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసి నా..మిద్దె తోటల పెంపకం, వాటిపై అవగాహన కల్పించే కేం ద్రాలు ఎక్కువవుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో దొ రికే కూరగాయలు, పండ్ల విషయంలో ప్రజలు అభద్రతా భా వం తో ఉండడంతో పాటు రైతులు కూడా దిగుబడి ఎక్కువ రావా లన్న ఆలోచనతో రసాయనాల వినియోగం పెంచడంతో పా టు, మార్కెట్లో అవి తాజాగా ఉండేందుకు దుకాణదారులు కె మికల్స్ని వాడడం వలన కూరగాయలు కొనాలంటే దడ పుడుతోంది.
హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి నుంచి మొదలు పెడి తే..ఉప్పల్ వరకు..మేడ్చల్ నుంచి మొదలుపెడితే.. మెహ దీప ట్నం శివారు ప్రాంతాల వరకు ఉన్న అపార్ట్మెంట్లు, ఖాలీ స్థలా ల్లో ఎక్కడ చూసినా..గ్రీన్ హౌస్లే దర్శనమిస్తుం డడం గమ నార్హం. మరో వైపు విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా టెర్రస్గార్డెన్స్ పై సూచనలు, సలహా లిస్తు న్నారు. ఇందులో భాగంగానే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మై డ్రీమ్ ..గ్రీన్ హోం నిర్వాహకులు ఎక్కువుగా సమస్యలపై సల హాలు ఇస్తున్నారు. మై డ్రీం..గ్రీన్ హోం వారు మిద్దె తోటలకు అవస రమైన పరికరాలు, సేంద్రీయ ఎరు వులను కూడా అందిస్తున్నా రు. ఈ మిద్దెతోటలను ఇంటిలోని పై అంతస్తులో, కారిడార్‌తో పాటు ఇంటిలో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా కుటుంబానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను పండించవచ్చు. అయితే మిద్దె తోటలకు ప్రధానంగా స్థలంతో పాటు, సూర్య రశ్మి పడే విధంగా, వాటర్ అందే విధంగా ఉంటే మంచి నాణ్య మైన కూరగాయలను పండించుకోవచ్చని ప్రస్తుతం టెర్రస్ గార్డెన్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్న నిర్వహకులు చెబుతున్నారు.
4లక్షల మందికి పైగా టెర్రస్ గార్డెనింగ్
మారుతున్న వాతావరణ పరిస్థితులతో పాటు అధిక రసాయనిక ఎరువుల వినియోగంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో దీని నుంచి బయ టపడి.. ఆరో గ్యాన్ని కాపాడుకునేందుకు చాలా మంది ఈ టెర్రస్ గార్డెన్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగ రంలోనే సుమారు 4లక్షల మందికి పైగా మిద్దె తోటలను సాగుచేస్తున్నారని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ నిర్వహాకులు చెప్పారు. రోజురోజకి కాలుష్యం పెరుగుతుండడంతో పాటు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ టెర్రస్ గార్డెన్లే ఆదు కున్నాయని, మన ఇంట్లో మనం సేద్యం చేసుకుం టే..ఆరో గ్యంగా ఉండడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. టెర్రస్ గార్డెనింగ్ల ద్వారా ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడడంతో పాటు.. సోషల్ మీడియా ద్వారా పలు సమస్యలపై సలహాలు, సూచన లు ఇవ్వడంతో మానవ బంధాలు కూడా పెరుగుతున్నాయి.
భవిష్యత్ తరాలకు వ్యవసాయాన్ని తెలిపేలా..
ప్రస్తుతం గ్రామాల్లోని యువత అంతా ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చి స్థిరపడడంతో వారి పిల్లలకు వ్యవసాయం అంటే ఏంటో తెలియని పరిస్థితి..ఈ నేపథ్యంలో ఈ టెర్రస్ గార్డెన్ల ద్వారా వ్యవసాయం, దాని అవసరాన్ని కూలం కషంగా వివరించేందుకు బాగుందని నిర్వహాకులు చెబుతు న్నారు. దీంతో పాటు వ్యవసాయం యొక్క అవసరం, ఒక మొక్క ఫలితాన్ని ఇవ్వాలంటే దాన్ని ఎలా సంరక్షించాలి అనే అంశాలను పిల్లలకు తెలియపర్చడం ద్వారా వారికి వ్యవ సాయంపై మక్కువ ఏర్పడడంతో పాటు వృధా కాకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు నిర్వహాకులు.
మిద్దె తోటలతో..ఆరోగ్యం కూడా..
నాణ్యమైన కూరగాయలు, పండ్లే కాకుండా వాతా వర ణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని కూడా తగ్గించే విధంగా ఈ మిద్దెతోటలు దోహదపడుతాయి. అంతేకాకుండా ప్రస్తుత పరి స్థితుల్లో చాలా మంది షుగర్ పేషంట్లకు అలాంటి వారికి వ్యా ధిని నియంత్రణలో ఉంచేందుకు అవసరమైన కొన్ని రకాల మూలికా మొక్కలను కూడా సిటి ఆఫ్ టెర్రస్ గార్డెన్ వారు పెం చుతున్నారు. దీంతో పాటు మిద్దెతోటల్లో సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత రావడంతో పాటు మానసిక ఒత్తిడులు తగ్గుతున్నట్టు తెలుపుతున్నారు. మిద్దె తోటల్లో వాటి నిర్వహాణ చూసుకోవడం వలన శారీరక శ్రమ చేస్తుండడంతో మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
మిద్దెతోటల్లో ఒక్క కూరగాయలే కాదు.. ఆరోగ్య మూలికా మొక్కలు కూడా..
టెర్రస్ గార్డెన్లలో ఒక్క కూరగాయలే కాకుండా..పండ్లతో పాటు ఆరోగ్యానికి అవసరమైన కొన్ని మూలికా మొక్కలను కూడా పెంచుకునే వీలుంది. దీంతో ఆరోగ్యానికి అవసరమైన మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంట్లోని వారందరికి ఆరోగ్యకరమైన గాలి అందుతుం దంటున్నారు నిర్వహాకులు. మొత్తానికి టెర్రస్గార్డెన్లు ఒక్క కూరగాయలు, పండ్లే కాకుండా మనిషికి అవసరమైన ప్రతి అవసరాన్ని తీరుస్తుండడంతో పట్టణ, పల్లె వాసులంతా దీని వైపే చూస్తున్నారు. ఈ టెర్రస్ గార్డెన్లు, సేంద్రీయ వ్యవ సాయానికి ప్రభుత్వం కూడా చేయూతనందిస్తే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు నిర్వహాకులు.
నయా ఫార్మింగ్ – టెర్రస్ గార్డెన్స్….
Advertisement
తాజా వార్తలు
Advertisement