భారత్ లో ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన జాతీయ సినిమా దినోత్సవం వాయిదా పడింది. జాతీయ సినిమా దినోత్సవాన్ని సెప్టెంబరు 23కి వాయిదా వేసినట్టు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) వెల్లడించింది. జాతీయ సినిమా దినోత్సవం నాడు దేశంలోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్ లలో రూ.75కే ప్రత్యేక ప్రవేశ టికెట్ అందజేయాలని ఎంఏఐ నిర్ణయించింది. పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్, కార్నివాల్, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సినిమా దినోత్సవంలో పాలుపంచుకుంటున్నాయి. అయితే ఈ వేడుకల్లో మరిన్ని మల్టీప్లెక్స్ లను కలుపుకుని పోయేందుకు గాను జాతీయ సినిమా దినోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎంఏఐ తెలిపింది. జాతీయ సినిమా దినోత్సవం నాడు మల్టీప్లెక్స్ లకు, థియేటర్లకు భారీగా తరలిరావాలని ఎంఏఐ ప్రేక్షకులను ఆహ్వానించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement