Friday, September 13, 2024

HYD: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్ లో కనిపించిన నేచురల్ స్టార్ నాని

హైదరాబాద్ : నేచురల్ స్టార్ గా పేరుపొందిన తెలుగు నటుడు నాని ఇటీవల ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్ లో కనిపించారు. ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో నాని అనే తన ముద్దుపేరు గురించి, మరచిపోలేని ఫ్యాన్ ఇంటరాక్షన్ గురించి, భవిష్యత్తులో తను కలిసి పనిచేయాలని కలలు కనే నటులు, దర్శకుల గురించి ఇలా మరెన్నో విషయాల గురించి ఓపెన్ అయ్యారు. నేచురల్ స్టార్ అనే ట్యాగ్ రావడం గురించి అడిగినప్పుడు ఇది కేవలం ఒక ప్రత్యేకమైన పాత్ర కాదు, ఒక ప్రక్రియ అన్నారు.

మొదట్లో తాను ఎంచుకున్న సినిమాలు, తాను అనుసరించిన నటనా శైలి వల్ల తనను అందరూ సహజ నటుడు అంటే నేచురల్ యాక్టర్ అని పిలవడం మొదలుపెట్టారన్నారు. జండా పై కపిరాజు దర్శకుడు మొదట నేచురల్ స్టార్ నాని అనే టైటిల్ కట్ పెట్టాడని, ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ అనే బ్లాక్ బస్టర్ కామెడీకి కూడా నేచురల్ స్టార్ అనే టైటిల్ కూడా పెట్టాలనుకుంటున్నానని దర్శకుడు చెప్పాడు.

మొదట్లో అతను జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. కానీ, కొంత పట్టుబట్టి డైరెక్టర్ అ టైటిల్ ఉపయోగించాడు. ఇంకా అ సినిమా విజయం తర్వాత ప్రేక్షకులు ఆ ట్యాగ్ ను ఆదరించారు. మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా అభిమానుల ప్రేమ, సపోర్ట్ తనను ఆ ట్యాగ్ ని ఇష్టపడేలా చేసిందన్నాడు. దీంతో పాటు తనపై చెరగని ముద్ర వేసిన ఒక అభిమానితో జరిగిన సంభాషణను కూడా నాని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement