హైదరాబాద్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో రైతు ధర్నా నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు ధర్నా నిర్వహించాలంటూ టైమ్ ఫిక్స్ చేసింది. ఈ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, పలువురు నాయకులు హాజరు కానున్నారు.
- Advertisement -