సాగర్‌లో క్షేత్రస్థాయి బలాలపై సాంకేతిక కొలతలు
జన నాడిని పసిగట్టేందుకు కుస్తీలు
వరుస సర్వేలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్
తాజా సర్వేతో 50 శాతానికి పైబడి ఓట్లు వస్తాయని ధీమా
కాంగ్రెస్, బీజేపీలది కూడా అదే దారి
జానా కోసం వరుస సర్వేలు
దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ సర్వే
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇపుడు రాజకీయ పార్టీలన్నీ సర్వేల మంత్రం పఠిస్తున్నాయి. దుబ్బాక నేర్పిన పాఠంతో నాగార్జునసాగర్‌పై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు.. గురిపెట్టి అన్ని మార్గాలు, అవకాశాలు వినియోగించుకుంటున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికపుడు బేరీజు వేసుకునేందుకు నమ్మకమైన సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. కొందరు సొంత నెట్‌వర్క్ ద్వారా సర్వేలు నిర్వహింపజేసుకుని అంచనా కు వస్తున్నారు. సర్వేల విషయంలో.. ముఖ్యమంత్రికి గురి ఎక్కువ. గత ఆరున్నరేళ్ళుగా ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికపుడు పసిగట్టి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, పార్టీపరంగా అభ్యర్థు లను ఖరారు చేయడం.. విజయాలు సాధించడం సీఎంకు అలవాటుగా మారింది. ఒకే సంస్థ ద్వారా కాకుండా.. నాలుగైదు సంస్థల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుని.. వాటిని బేరీజు వేసుకుని రాజకీయ నిర్ణయాలు తీసు కుంటుంటారు. అనేకసార్లు సర్వే ఫలితాలను సీఎం స్వయంగా ఎమ్మెల్యే ల సమావేశంలో ప్రకటించారు. నేరుగా ఎమ్మెల్యేలకు పంపి.. పనితీరుపై సూచనలు చేయడం మామూలే. ఇక ఎన్నికలంటే.. ఎప్పటికపుడు సర్వేలు నిర్వహిస్తూనే ఉంటారు. జనాభిప్రాయం ఏ విధంగా ఉంది.. ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అన్న అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని రాజకీయంగా ఎత్తులు వేస్తుంటారు. గత రెండు రోజులుగా నాగార్జునసాగర్ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటూ అనువైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. టీఆర్‌ఎస్ వరుసగా సర్వే నివేదికలు వివిధ సంస్థల ద్వారా తెప్పించుకుంటుండగా, తాజా నివేది కలో టీఆర్‌ఎస్‌కు 50శాతం పైబడి ఓట్లు వస్తాయని రిపోర్ట్ వచ్చి నట్లు పార్టీముఖ్యులు చెబుతున్నారు. అభ్యర్థితో సంబంధం లేకుండా.. కారు టాప్‌గేర్‌లో దూసుకువెళ్తోందని, ఇందుకు తాజా సర్వే నివేదికలే సాక్ష్యమని సాగర్ నేతలు సంబురంగా చెబుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ ధీమాగా ఉంది. పార్టీ దిగ్గజం జానారెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేయగా, ఆ పార్టీ కూడా వరుస సర్వేలు నిర్వహిస్తూ ఎక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ నష్టం జరుగుతోంది అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్వేలో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉందని, అంకెలు కూడా అటుఇటుగా పేర్కొన్నట్లు సమాచారం. జానారెడ్డి స్థానికంగానే.. మకాంవేసి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు శతధా ప్రయత్ని స్తున్నారు. సర్వేల ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక బీజేపీ ముందునుండీ వరుస సర్వేలు నిర్వహిస్తోంది. చలో.. గుర్రంపోడు కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి.. క్షేత్రస్థాయిలో వ్యక్తమైన స్పందన తెలుసుకుం టోంది. గ్రాఫ్ పెరగడం, తగ్గడంపై కొలతలు పరిశీలిస్తోంది. నాగార్జునసాగర్‌తో పాటు పొరుగున ఉన్న నియోజక వర్గాల్లో కూడా వివిధ సర్వే సంస్థలను రంగంలోకి దింపి, ఏఏ చర్యలు చేపడితే 2023నాటికి ఆ నియోజకవర్గాలను కైవసం చేసుకో వొచ్చో పర్‌ఫెక్ట్ ప్రణాళికను రెడీ చేస్తోంది. నాగార్జునసాగర్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వేల ప్రాతిపదికనే టికెట్లు కేటాయించి లబ్ధిపొందిన భారతీయ జనతా పార్టీ.. ఇపుడు కూడా సర్వేలనే నమ్ముకున్నట్లు కనబడుతోంది. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో సర్వేల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయకపోవ డం వల్ల నష్టం జరిగిందని పార్టీ భావిస్తోంది. ప్రజాభి ప్రాయాన్ని కొలిచేందుకు.. అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆయా పార్టీల నేతలు కసిగా పనిచేస్తు న్నారు. విజయతీరం చేరేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
సీఎం సమీక్షలు
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న టీఆర్‌ఎస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ కూడా ఘనవిజయం సాధించి.. ఆ టెంపో కొనసాగిం చాలని, కార్పోరేషన్ ఎన్నికలకు టాప్‌గేర్‌తో వెళ్ళాలని పథకరచన చేసింది. సాగర్ కోసం ఇప్పటికే యువ ఎమ్మెల్యే లను రంగంలోకి దించిన సీఎం కేసీఆర్.. అభ్యర్థిత్వాలకు సం బంధించి కూడా రకరకాల సర్వేలు చేయించినట్లు తెలిసింది. యాదవ, రెడ్డి సామాజిక వర్గాల నుండి టికెట్ కోసం ప్రధా నంగా పోటీ ఉండగా.. సీఎం అనేక సమీకరణలు, భవిష్యత్తు పరిశీలిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉండగా, యాదవ సామాజిక వర్గం నుండి నోముల భగత్, గురుమూర్తి యాదవ్, రంజిత్ యాదవ్, బాలరాజు యాదవ్ తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత కోటిరెడ్డి కోసం పట్టుబడుతుం డగా, మరో నేత తనకు లేదా.. భగత్‌యాదవ్‌కు ఇవ్వమని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సర్వేలు.. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సీఎం కేసీఆర్ ఎవరివైపు మొగ్గుచూపు తారన్నది ఆసక్తికరంగా మారింది. బుధవారం నల్లగొండ నేతలతో సాగర్ ఉప ఎన్నికపై సీఎం మాట్లాడినట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌లో ఎన్నికల ఇన్‌ఛార్జిగా పనిచేసిన పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో విజయతీరం చేరేందుకు కృషిచేసిన నేపథ్యంలో.. తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయనకే మరోసారి సీఎం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
సీరియస్‌గా కాంగ్రెస్
నాగార్జునసాగర్ ఉపఎన్నికను కాంగ్రెస్ చావోరేవో అన్నంత సీరియస్‌గా భావిస్తోంది. -నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డిని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించగా, గ్రామాల వారీగా జనారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కులాల వారీగా సమీకరణలను చేపడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ టీమ్ పర్యటిస్తోంది. నాగార్జునసాగర్‌లో 27న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, జానారెడ్డి మీద సానుభూతి కలసి వసు ్తందనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానా రెడ్డిలు సాగర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. -నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓడిపోకుండా సర్వశక్తులు ఒడ్డి గెలవాలని హస్తం పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.