Friday, November 22, 2024

HYD: పల్లవి ఇంజినీరింగ్ కాలేజీకి NAAC ‘A’ గుర్తింపు..!

పల్లవి ఇంజనీరింగ్ కళాశాల న్యాక్ చే ‘A’ గ్రేడ్‌తో గుర్తింపు పొందింది. 2023 ఆగస్టు 24న కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాలేజీ చైర్మన్ మల్కా కొమరయ్య విలేకరులతో మాట్లాడుతూ.. పీఈసీకి 3.18 సీజీపీఏ లభించి తెలంగాణ రాష్ట్రంలోని అగ్రశ్రేణి కళాశాలల్లో ఒకటిగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బి.రాజు మాట్లాడుతూ.. కళాశాల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను చూసి న్యాక్ విజిటింగ్ కమిటీ సంతోషం వ్యక్తం చేసిందన్నారు. కమిటీ 2023, మే 11 మరియు 12 తేదీల్లో కళాశాలను సందర్శించి NAAC ‘A’ గ్రేడ్‌ను అందించింది.


ఈ సంతోషకరమైన తరుణంలో, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.బి.రాజు.. NAAC కో-ఆర్డినేటర్, IQAC I/C, ఆల్ క్రైటీరియా ఇన్‌చార్జ్‌లు, కాలేజీ వాటాదారులు, మొత్తం స్టాఫ్ & మేనేజ్‌మెంట్ వారి అలుపెరగని కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరంలో ఈ అకడమిక్ అచీవ్‌మెంట్ గుర్తింపు పల్లవియన్లందరికీ చిరస్మరణీయమైన క్షణం. పల్లవి గ్రూప్ చైర్మన్ మల్కా కొమరయ్య … ఈ విజయానికి అద్భుతమైన వ్యూహాలు పన్నిన పల్లవి టీమ్ ని అభినందించారు. NAAC అక్రిడిటేషన్‌ను సాధించడంలో మైలురాయిని చేరుకున్నందుకు సంబరాలు చేసుకోవడానికి ఈ వేడుకను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా NAAC కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.స్రవంతి, క్రైటీరియా కో-ఆర్డినేటర్లు ఎం. ప్రియంవద, కె ధనుంజయ్ & ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ కె.కవిత తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. అలాగే మరెన్నో మైలురాళ్లను చేరుకోవడానికి, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడానికి తాము ఈ కృషిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా మంచి ప్యాకేజీలతో వివిధ MNCలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను కూడా అభినందించారు. పల్లవి గ్రూప్ చైర్మన్ మల్కా కొమరయ్య, శాలివాహన గ్రూపుల డైరెక్టర్ మల్కా నవీన్, పీఈసీ డైరెక్టర్ డాక్టర్ జే గోవర్ధన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబీ రాజు, డైరెక్టర్ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్స్ & కార్పోరేట్ రిలేషన్స్ సుమేధా రమేష్, డిపార్ట్‌మెంట్ హెడ్‌ రాజేందర్.. ఈసీఈ డిపార్ట్‌మెంట్ నుంచి 10 ఉద్యోగాల ఆఫర్లను సాధించిన కశ్యప్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అందులో 12LPAలలో అత్యధిక ప్యాకేజీ. EEE విభాగం నుంచి అజిత్ కూడా మూడు ఉద్యోగ ఆఫర్లను పొందాడు. విద్యార్థులకు MNCలతోపాటు పల్లవి ఇంజినీరింగ్ కళాశాల అపర్ణ కన్స్ట్రక్షన్స్, యూనిరాక్, ECLAT, పల్లె టెక్నాలజీస్ వంటి వివిధ కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో ప్లేస్‌మెంట్ ఆఫర్లను అందించింది. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల గురించి తమ విలువైన అవగాహనలను, అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుక సందర్భంగా కళాశాల సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement