హైదరాబాద్ : సంగీత విద్యలో మహోన్నత సంస్థగా వెలుగొందుతున్నముజిగల్, తమ స్టెప్ అప్ బూట్‌క్యాంప్‌తో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. గత నెలాఖారులో హైదరాబాద్‌లోని 12 అకాడమీలలోని ఉపాధ్యాయుల కోసం రూపొందించబడిన ఈ లీనమయ్యే కార్యక్రమం ఫిబ్రవరిలో జరగబోయే దేశవ్యాప్త బూట్‌క్యాంప్‌కు నాందిగా నిలిచింది. 20,000 మంది విద్యార్థులు, 350కు పైగా అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు, 50కి పైగా విలువైన భాగస్వాములను కలిగి ఉన్న ప్రపంచ కమ్యూనిటీతో, ముజిగల్ సంగీత విద్యా రంగాన్ని సమున్నతం చేస్తోంది.
ముజిగల్ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ…. విద్యార్థుల విజయానికి ముజిగల్ లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తూ ఈ శిక్షణా సెషన్ లు జరిగాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన పన్నెండు అకాడమీలు సంగీత ప్రదర్శనలో తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాయన్నారు. ముజిగల్ మాదాపూర్ విజేతగా నిలవగా, ముజిగల్ బీరంగూడ రన్నరప్‌గా నిలిచిందన్నారు. అకాడమీ ఉపాధ్యాయులు, కార్పోరేట్ జట్టు మధ్య ఉత్సాహపూరితమైన క్రికెట్ మ్యాచ్ జరిగిందని, ఇది ముజిగల్ కమ్యూనిటీలోని విభిన్న ప్రతిభను, అభిరుచులను ప్రదర్శించిందన్నారు. స్నేహాన్ని బలోపేతం చేసిందని, రాబోయే నెలల్లో మరిన్ని బూట్‌క్యాంప్‌లు, ఈవెంట్ లు జరుగనున్నాయన్నారు.