Thursday, November 21, 2024

కూయాప్ తో ఎంఎస్ఎంఈ ఒప్పందం

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒకే జిల్లా, ఒకే ప్రొడక్ట్ చొరవను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కంటెంట్‌ని వారి వారి స్థానిక భాషల్లో ఉపయోగించుకోడానికి, వ్యక్తీకరించడానికి రూపొందించిన మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం అయిన కూ (koo) యాప్‌తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. అదనపు చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ IAS, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కూ (koo) కో-ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్రమేయ రాధాకృష్ణ తో ఎంఓయూపై సంతకం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈసంద‌ర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ MSME అండ్ ఎగుమతి ప్రమోషన్ అదనపు ముఖ్య కార్యదర్శి నవనీత్ సెహగల్ మాట్లాడుతూ… కూ(Koo) తో ఈ అనుబంధం త‌మ ఓడిఓపి (ODOP) ఉత్పత్తులను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేయడంలో సహాయపడుతుందన్నారు. అనేక ప్రాంతీయ భాషల్లో ఓడిఓపి (ODOP) చుట్టూ సంభాషణలను నడపడానికి సహాయపడుతుంద‌ని తెలిపారు. కూ సహ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ… ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈ ఎంఓయూ(MOU) పై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఓడిఓపి(ODOP) తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంలో ఉత్తరప్రదేశ్(UP) అగ్రగామిగా నిలిచిందన్నారు. స్థానిక కళాకారులు కళలను తీసుకువెళ్లి, భారతదేశం అంతటా వివిధ భాషలలో ప్రచారం చేయడం నిజంగా సంతోషకరమ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement