హైదరాబాద్ : అతిపెద్ద టైర్ల తయారీ సంస్థ అయిన ఎంఆర్‌ఎఫ్, అత్యధిక పనితీరు కలిగిన మోటారు సైకిల్స్ కోసం ఇటీవల కొత్త స్టీల్ బ్రేస్ రేడియల్స్‌ని ప్రవేశపెట్టింది. స్టీల్ బ్రేస్ రేడియల్స్ అనేవి ప్రత్యేకమైన టైర్లు, తీవ్ర పరిస్థితుల్లో సైతం అసాధారణ పనితీరు కనబరచాల్సిన హైఎండ్ మోటారు సైకిల్స్ కోసం ప్రత్యేకంగా తయారయ్యాయి. గత కొన్నేళ్లుగా ఎంఆర్‌ఎఫ్‌లో ఆర్‌అండ్‌డి బృందం వాస్తవ ప్రపంచానికి సరిపోయే పరిస్థితుల్లో విస్తృతంగా పరీక్షించడానికి సాంకేతికత సాయంతో ఖచ్చితత్వం సాధించింది.
ఈ టైర్లు దృడత్వంతో పాటు స్థిరత్వాన్ని, స్ట్రాంగ్ గ్రిప్‌ని, షాక్ అబ్సార్షన్‌ని, స్వీఫ్ట్ స్టిరింగ్ ప్రతిస్పందనని అందిస్తాయి. అతిపెద్ద టైర్ల తయారీదారుల ప్రధాన కార్యాలయం ఇండియాలోని చెన్నైలో ఉంది. టైర్లని 90 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ టైర్లు త్రెడ్స్ అండ్ ట్యూబ్స్, స్పోర్ట్స్ గుడ్స్ పెయింట్స్, బొమ్మలతో సహా రబ్బర్ ఉత్పత్తులు తయారు చేస్తోంది. ఎంఆర్‌ఎఫ్ లి, ఎంఆర్‌ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ ని, మోటార్ స్పోర్ట్‌లో ఎంఆర్‌ఎఫ్ ఛాలెంజ్ సిరీస్‌ని కూడా నిర్వహిస్తోంది.