Saturday, November 23, 2024

దేశానికి రోల్ మోడల్ గా ‘మిషన్ భగీరధ’

హైదరాబాద్ : మిష‌న్ భ‌గీర‌ధ దేశానికి రోల్ మోడ‌ల్‌గా మారిందని రాజ్య‌స‌భ‌లో ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. జ‌ల్ జీవిన్ ప‌థ‌కానికి అది ప్రేర‌ణ‌‌గా నిలిచింద‌న్నారు. ఇంటింటికి నీరు అందించ‌డంలో.. తెలంగాణ‌లో 98 శాతం టార్గెట్‌ను అచీవ్ చేశామ‌‌న్నారు. 30 వేల కోట్లు ఖ‌ర్చు చేసి.. మిష‌న్ భ‌గీర‌థ‌ను స‌క్సెస్ చేశామ‌న్నారు. డైన‌మిక్ సీఎం కేసీఆర్ సార‌థ్యంలో ఈ ప‌థ‌కం అద్భుత ఫ‌లితాల‌ను ఇస్తోంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎంతో ఆశించామ‌ని, 25105 కోట్ల ప్ర‌త్యేక‌ ప్యాకేజీని తెలంగాణ‌కు కేంద్రం ఇస్తుంద‌ని ఆశించిన‌ట్లు చెప్పారు. భ‌గీర‌థ మిష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసినందుకు కేంద్రం స‌హాకారం అందించాల‌న్నారు. ఫ‌ర్టిలైజ‌ర్స్ స‌బ్సిడీకి ఎటువంటి విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌లేద‌న్నారు. మ‌న్రేగా కేటాయింపుల‌ను త‌గ్గించార‌న్నారు. వెనుబ‌డిన ప్రాంతాల అభివృద్ధి కింద తెలంగాన‌కు 1350 కోట్లు ఇవ్వాల‌‌ని ఆయ‌న కోరారు. కోవిడ్ నుంచి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ త్వ‌ర‌గా కోలుకుంటుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement