Friday, November 22, 2024

కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంపి సంతోష్ కుమార్ అండ‌…

నిమ్స్‌లో డయాలసిస్‌ బెడ్ల సంఖ్య పెంచేందుకు సహకారం
ఎంపీ కోటా నిధులతో పాటు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో భోరోసాకు హామీ
దేశానికే ఆదర్శంగా తెలంగాణ డయాలసిస్‌ కేంద్రాలు: ఎంపీ సంతోష్‌కు వివరించిన వైద్యులు

హైదరాబాద్‌, నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో కిడ్నీ వ్యాధుల బారిన పడి డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు అండగా నిలవాలని, తమవంతు సహాయాన్ని అందిం చాలని రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ నిర్ణయిం చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్‌ సూచనలతో నిమ్స్‌లో కిడ్నీ పేషంట్లకు ఉచి తంగా డయాలసిస్‌ సేవలు అందుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా 56 బెడ్లు కిడ్నీ పేషంట్ల డయా లసిస్‌ కోసమే ఉన్నాయి. సోమవారం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి నిమ్స్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు వచ్చిన సంతోష్‌ కుమార్‌ అక్కడున్న డయాలసిస్‌ యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న నిమ్స్‌ డైరెక్టర్‌ మనో హర్‌, డాక్టర్‌ గంగాధర్‌, డాక్టర్‌ రమేష్‌లతో సంతోష్‌ కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మంది కిడ్నీ బాధితులు డయాలసిస్‌ కేంద్రాలను ఉపయోగించు కుంటున్నారని, నిమ్స్‌లో డయా లసిస్‌ కేంద్రాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిమ్స్‌లో బెడ్ల సంఖ్యను మరింత పెంచేందుకు, కిడ్నీ పేషంట్లకు అవసరమైన సౌక ర్యాలను మెరుగుపర్చడానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తానని, దీనికి సంబంధించిన ప్రతి పాద న లను పంపాలని సూచించారు. దీంతో పాటు కార్పొ రేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) కింద కూడా నిధులను సమీకరించుకోవడానికి వీలుందని, దీనికి సంబంధించి కూడా దాతలను తాను రిక్వెస్ట్‌ చేస్తానని, ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరిచి కిడ్నీ బాధితులకు ఇబ్బందులు లేకుండా చేద్దామని చెప్పారు.
ప్రైవేట్‌ ఆస్పత్రులకంటే అద్భుతంగా..
సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిమ్స్‌లో డయాలసిస్‌ కోసం పేషంట్లకు ఆర్టిఫిషియల్‌ కిడ్నీని ఒకేసారి వాడు తున్నామని, రీ యూట్‌ కిడ్నీ కిట్లను వాడడం లేదని వైద్యులు ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కు వివ రించారు. ప్రతి పేషంట్‌కు కొత్తదే వాడుతామని, ఈ తరహాలో రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా లేదని వైద్యులు తెలిపారు.
గతంలో కిడ్నీ పేషంట్లు డయాలసిస్‌ చేయించు కోవాలంటే వేలాది రూపా యలు ఖర్చయ్యేవని, కానీ ఇపుడు నయాపైసా లేకుం డా ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నామని వైద్యులు చెప్పారు. నిమ్స్‌లో డయాలసిస్‌ యూనిట్‌ సక్సెస్‌ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా 46 డయాలసిస్‌ కేంద్రా ల ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దేశానికే ఆద ర్శంగా తెలంగాణ డయాలసిస్‌ కేంద్రాలు నిలుసు ్తన్నాయని, రాత్రింబవళ్లు ఇక్కడ డయాలిస్‌ కేంద్రాలు పని చేస్తు న్నాయని వైద్యులు తెలిపారు. డయాలసిస్‌ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బందిని, వైద్యులను ఎంపీ సంతోష్‌ కుమార్‌ అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఏం చేసినా పేదల ప్రజల కోణంలో ఆలోచించి చేస్తారన డానికి డయాలసిస్‌ కేంద్రాలే ఒక ఉదాహరణ అని సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement