సోషల్ వర్కర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధుతాయి సప్కల్ ఇక లేరు.. 74 ఏళ్ల ఆమె గుండెపోటుతో మహారాష్ట్రలోని పూణేలో మరణించారు. ఆమెకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో నవంబర్ 14, 1948లో జన్మించారు సప్కల్. 12 ఏళ్ల వయస్సులో ఆమెకు 32 ఏళ్లున్న వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తరువాత.. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు. అమె అనాథల సంక్షేమానికి కృషి చేసింది. ఏకంగా 1400 మంది అనాధ పిల్లలను చేరదీసి వారి ఆలనాపాలన చూసుకుంది. ఇందులో చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. ఆమె జీవిత కథ ఆధారంగా 2010లో మరాఠీలో “మి సింధుతాయ్ సప్కాల్ బోల్టే” అనే పేరుతో బయోపిక్ వచ్చంది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఆమె మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. కూ యాప్ ద్వారా కిషన్ రెడ్డి తన సానుభూతిని వ్యక్తపరిచారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital