ఎవరు ఎక్కడైనా ఉండనీయండి లేదంటే ఎక్కడైనా చదవనీయండి… ఇంటిలో వండిన వంటకాలతో లంచ్‌బాక్స్ మాత్రం తప్పనిసరిగా దర్శనమిచ్చేది. కాలం మారవచ్చు. అభిరుచులూ మారవచ్చు కానీ ఇంటి భోజనం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆఖరకు ఒకరు పనిచేయడం ప్రారంభించినా, అమ్మ మాత్రం లంచ్ బాక్స్ అవసరాలను చూసుకుంటుంది. అదెప్పుడూ సమతుల ఆహారమే అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో అమ్మ చేతి వంటను అభిమానించని వారెవరరూ ఉండరంటే అతిశయోక్తి కాకపోవచ్చు. ఎందుకంటే అమ్మ చేతిలోనే ఆ మహత్మ్యం ఉంది. ఇద్దరు పిల్లల తల్లి అరుణ ప్రియ మాట్లాడుతూ… కనిపించినంత సులభమేమీ కాదు లంచ్‌బాక్స్ సిద్ధం చేయడమంటే.. అది ఓ ప్రత్యేక బంధం అన్నారు. కొన్ని సార్లు తల్లి, పిల్లల బంధం మాత్రమే కనిపించవచ్చు. మరికొన్ని సార్లు తమ పిల్లలు, వాళ్ల స్నేహితులు కూడా ఉండొచ్చన్నారు. వారు తమ పిల్లల లంచ్‌బాక్స్‌ను ఇష్టపడితే వారి స్నేహం కూడా బలోపేతం అవుతుందన్నారు. అది దృష్టిలో పెట్టుకుని లంచ్‌బాక్స్ సిద్ధం చేస్తాను.. మా అమ్మ కూడా అలాగే చేసేదని అన్నారు. గోల్డ్ డ్రాప్ డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మితేష్ లోహియా మాట్లాడుతూ… మహమ్మారి సమయాల్లో లంచ్‌బాక్స్‌లను మీల్ టైమ్స్ రీప్లేస్ చేశాయన్నారు. కానీ అమ్మ విధిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదన్నారు. నిజానికి గతంతో పోలిస్తే కిచెన్‌లో మరింత సృజనాత్మకత కనిపిస్తుందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటిలో వండిన వంటకాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement