హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు మాల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, గడువు ముగిసిన నువ్వుల గింజలు, టోన్డ్ పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్ల రసాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించినమీదట బయట పడేశామని చెప్పారు. ఫుడ్ సెక్షన్ లోని వర్కర్లు మాస్కులు, హెయిర్ క్యాప్స్, గ్లవ్స్ ధరించలేదని సీరియస్ అయ్యారు. కాగా, ఇలాంటి ఎక్స్‌పైరీ అయిన ఫుడ్స్ అమ్ముతున్న లులు మాల్ మేనేజ్‌మెంట్‌కి నోటీసులు అందజేసినట్టు ఫుడ్ ఇన్‌స్పెక్షన్ అధికారులు తెలిపారు.
కాగా, మాల్‌లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్‌కు బూజు పట్టినట్టు అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన 20 కిలోల నువ్వుల గింజలు, 20 లీటర్ల టోన్డ్ పాలు, 7.5 కిలోల బిస్కెట్ ప్యాకెట్లు, ఐదు కిలోల జెమ్స్, రెండు ప్యాకెట్ల పండ్ల రసాలు గుర్తించి బయట పడేశారు. అలాగే.. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి పత్రాన్ని ప్రవేశ ద్వారం వద్ద ప్రదర్శించ లేదని గుర్తించారు. రూల్స్ పాటించకుండా, ఎక్స్‌పైరీ అయిన ఫుడ్స్ అమ్ముతున్న నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.