Monday, November 25, 2024

ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తాన‌న్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణ్య, నవగ్రహ, భద్రకాళీ, వీరభద్ర, ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… స్వామి వారి ఆలయ విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ఎప్పుడూ సహకారం అందిస్తానని పేర్కొన్నారు. స్వామి వారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని, కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, వేణు యాదవ్, బాబు గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు అంజయ్య, ఉపాధ్యక్షుడు రాజమౌళి, కోశాధికారి లక్ష్మణ్, కార్యదర్శి నరేష్, శివ ప్రకాష్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement