Tuesday, November 26, 2024

HYD: ఇల్లు కూలిన కుటుంబానికి రూ.1లక్ష అందజేసిన ఎమ్మెల్యే వివేకానంద్

ఇళ్లు కూలిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1లక్ష ల ఆర్థిక సహాయం అందజేశారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం ఉంటున్న వంపుగూడెం శాంతమ్మ పురాతన ఇల్లు నిన్నరాత్రి కూలిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ఈరోజు వారిని పరామర్శించి బాధితురాలి కుటుంబానికి 1లక్ష రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్ని విభాగాల అధికారులందరూ సమీక్షించుకుంటూ నియోజకవర్గ పరిధిలోని పురాతన భవనాలను గుర్తించి వాటిలో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement