అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ నగర్ లో ఈరోజు వీడీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ.33 లక్షల అంచనాలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ నగర్ బస్తీ ప్రజలు, ఆధికారులు, టి.ఆర్.యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.