కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి, కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్ధిక ప్యాకేజీలు, పథకాలు అమలు జరుపుతుందని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని సెలూన్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో చేతివృత్తిదారులు, కుల వృత్తిదారులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇటీవల నాయిబ్రాహ్మాణుల కులు వృత్తి క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ అందించడం హార్శనీయమన్నారు. అదే విధంగా రకులకు ఉచిత విద్యుత్, గోల్ల కురుమలకు గోర్రెల పం పిణీ, గంతపుత్రులకు చెపల పం పిణీ ఇలా అనేక కుల వృత్తుల వారిని ఆదుకున్న ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. ప్రతి వృత్తికి ప్యాకేజిలు, పథకాలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో అన్ని కులవృత్తులకు పథకాలు ప్రకటించి అమలు జరుపుతున్నారని ఆయన చెప్పారు. కరోనా వచ్చిన తర్వాత కులవృత్తులు, చేతి వృత్తులు పనులు సాగడం లేదని, అందుకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement