Tuesday, November 19, 2024

పూడికతీత పనులు..

కవాడిగూడ : రాంనగర్‌ డివిజన్‌లోని వివిధ బస్తీలలో డ్రైనేజి, వరదనీటి పైపులైన్ల పూడికతీత పనులు త్వరగా పూర్తిచేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ జిహెచ్‌ఎంసి, వాటర్‌వర్స్క్‌ అధికారులను ఆదేశించారు. బస్తీలలో డ్రైనేజీ, వరదనీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం వర్షాలు కురిసిన సమయంలో నాలాలు, డ్రైనేజిలు పొంగి పోర్లుతున్నాయని ఇక్కడి ప్రజలు సమస్యను తన దృష్టికి తీసువచ్చారని ఆయన వెల్లడించారు. డివిజన్‌లోని సూర్యనగర్‌లో కచ్చానాలా పూడికతీత పనులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని వివిధ బస్తీలలో డ్రైనేజి, వరదనీటి పైపులైన్ల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే ఆయా బస్తీలలో నూతన పైప్‌లైన్‌లు వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే వర్షాకాలం లోపే పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement