హైదరాబాద్ :తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులు బెస్ట్ అని క్రాంతి కిరణ్ తెలిపారు. పోలీసు శాఖ పద్దులపై శాసనసభలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు. ప్రపంచ చిత్ర పటంలోనే తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు వచ్చింది. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. దీంతో పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను నెలకొల్పుతున్నామని తెలిపారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు రాష్ర్ట పోలీసు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ఒకప్పుడు పోలీసులంటేనే ప్రజలు భయపడేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ప్రజలపై నమ్మకం పెరిగిందన్నారు. నేరాలను నియంత్రించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాల ఏర్పాటుతో నేరాలను పూర్తిగా అరికట్టగలిగామని తెలిపారు. కిడ్నాప్ కేసులను 24 గంటల్లోనే ఛేదిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేక స్థానముంది. నేర పరిశోధనలో స్కాట్‌లాండ్, ముంబై పోలీసులను తెలంగాణ పోలీసులు అధిగమించారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు మరిచిపోలేనివి అని పేర్కొన్నారు. నిరాశ్రయులను చేరదీసి వారి సొంతూర్లకు పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని ఎమ్మెల్యే క్రాంతి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement