కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బర్త్ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని నగరంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శలువా కప్పి, పూల బోకే ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కుత్బుల్లాపూర్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -