చర్లపల్లి డివిజన్: చర్లపల్లి డివిజన్లోని నాగార్జున నగర్, కుషాయిగూడ కాలనీల్లో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు వెంకట నారాయణకు రూ. 50వేలు, బుచ్చి రెడ్డికి రూ.31,500లు, స్వప్నకు రూ.22ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ సీఐ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన పాల్ రెడ్డి, బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డప్పు గిరిబాబు, ప్రధాన కార్యదర్శి సారా అనిల్ ముదిరాజ్, నాయకులు గంప కృష్ణ, సారా వినోద్, మల్లారెడ్డి, రెడ్డి నాయక్, వెంకటేష్, యాదగిరి, సత్యనారాయణ, చంద్రమౌళి భూపతి వెంకటేష్, నరసింహ, లక్ష్మీ, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement