Sunday, November 17, 2024

TS : మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెండ్‌..

తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్‌ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్‌ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement