Friday, October 18, 2024

Missing – హైద‌రాబాద్ లో ఒకే రోజు నవ వదువుతో సహా న‌లుగురు మిస్సింగ్ …

నగరంలో ఒకే రోజు నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వేరు వేరు ప్రాంతంలో ఇద్దరు బాలురు, ఒక యువతి, నవ వధువు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు నలుగు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్ గా మారింది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

జగద్గిరిగి గుట్టలో రోషన్ అనే పదేళ్ల బాలుడు అదృశ్యం అయ్యాడు. ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. ఎంతసేపటికి రోషన్ ఇంటికి రాకపోవడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు బయటకు వెళ్లి చూడగా రోషన్ కనిపించలేదు. చుట్టుపక్కన వున్న వాళ్లను అడిగినా రోషన్ ను బయట చూడలేదని చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రోషన్ ను ధర్మవరం రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రోషన్ ను ఎవరైనా తీసుకుని వెళ్లారా? లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

- Advertisement -

ఇక మరో సంఘటన బాలానగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పదేళ్ల బాలుడు అదృశ్యం కావడం కాలనీ వాసులు భాయాందోళనకు గురవుతున్నారు. ఏపీహెచ్ బీ కాలనీలో తల్లి మందలించిందని కృతిక్ కళ్యాణ్ అనే పదేళ్ల బాలుడు సైకిల్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

కాగా.. సూరారం పోలీస్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. సత్యవతి, రమణ దంపతుల కూతురు పార్వతి కనిపించకుండా పోయింది. దీంతో చుట్టు ప్రక్కల, బంధువుల ఇళ్లల్లో వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు.

న‌వ వ‌ధువు కూడా…

ఇక పెళ్లయిన నెల రోజులకే నవ వధువు కనిపించకుండా పోవడంతో భర్త షాక్ తిన్నాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఖాజా బాగ్ లో నివాసముండే ముదావత్ సంతోష్ కి ముదావత్ అనితతో మార్చిలో వివాహం జరిగింది. సంతోష్ రోజూలాగేనే ఆఫీస్ కి బయలు దేరాడు. అయితే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. అయితే.. పక్కనే ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని కొద్దిసేపు ఇంట్లో సేద తీరాడు. ఎంతసేపటికి అనిత ఇంటికి రాకపోవడంతో.. బయటకు వచ్చిన సంతోష్ చుట్టుపక్కల, తెలిసిన బంధువుల ఇళ్లలో వెతికినా అనిత ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, భర్త సంతోష్ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీనులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement