హైదరాబాద్ : సబ్బండ వర్గాల సంక్షేమ, అభివృద్ధి సమాహారంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బడ్జెట్‌పై మంత్రి స్పందిస్తూ.. అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2020–21 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, సకల జనుల సంక్షేమం, అభివృద్ధిని వీడకుండా బడ్జెట్‌ని రూపొందించారని కొనియాడారు. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథకు నిధులు కేటాయించడం, వరంగల్ కార్పొరేషన్‌కి రూ. 250 కోట్లు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే అధికంగా నిధులు కేటాయించడం వల్ల హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడ్జెట్‌పై మంత్రి స్పందిస్తూ.. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేదిగా ఉందన్నారు. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాంను కొత్తగా ప్రవేశపెట్టి రూ. 1,000 కోట్లు కేటాయించడం హర్షనీయమన్నారు. దళితులు, మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి సీఎం అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఇదొక తాజా నిదర్శనం అన్నారు.
ఈ బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ ఉపాధి కల్పన, వ్యవసాయం, సంక్షేమ రంగాల సమానాభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చిందన్నారు. వైద్యం, విద్యారంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన బడ్జెట్ ఇది. 50 శాతానికి పైగా నిధులు వ్యవసాయానికి అనుబంధ వృత్తులకు ఖర్చు చేస్తూ శాశ్వతమైన అభివృద్ధికి దారులు వేసేలా బడ్జెట్‌ను రూపొందించిన తీరు ప్రశంసనీయమన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపకల్పన చేశారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరోనా క్లిష్ట సమయంలో లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని తెలిపారు. దళిత అభ్యున్నతికి రూ. వెయ్యి కోట్ల నిధులతో దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అనే పథకాన్ని రూపొందించి..సీఎం కేసీఆర్ షెడ్యూల్ కులాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు.
దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. ఇది పూర్తిగా రైతు ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉందని మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు, మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
బడ్జెట్ జనరంజకం – కెసిఆర్ పై మంత్రుల ప్రశంసల జల్లు…
Advertisement
తాజా వార్తలు
Advertisement