Tuesday, November 26, 2024

స‌న‌త్ న‌గ‌ర్ లో అభివృద్ది ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా రూ.6.31 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన‌ 16 అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి అధికారులను మంత్రి ఆదేశించారు. అనేక సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి ఈసంద‌ర్భంగా ప్ర‌జ‌లు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement