సికింద్రాబాద్ : నిజాం హయాంలో బన్సీలాల్ పేటలో నిర్మించిన పురాతన మెట్ల బావిని గురువారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి సందర్శించారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే చారిత్రక కట్టడాలను పరిరక్షించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. స్థానిక ప్రజల అవసరాలను తీర్చిన ఏడంతస్తుల లోతు కలిగిన బన్సీలాల్ పేటలోని మెట్లబావి కొలను మట్టి, చెత్తాచెదారంతో పూర్తిగా కూరుకుపోయింది.
గత 6 నెలల నుండి ఈ బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఈ బావిని పునరుద్దరించడం ద్వారా దీనికి పూర్వ వైభవం వస్తుందన్నారు. నగరంలో ఇలాంటి బావులు 44 వరకు ఉండగా, ఇప్పటికే ఆరు బావుల పునరుద్దరణ పనులు చేపట్టడం జరిగింది. హైదరాబాద్ లో 60వరకు పురాతన మెట్ల బావులున్నాయి. ఇప్పటికే ఆరు పురాతన మెట్ల బావులను పునరుద్దరించాం..చరిత్రను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..