ప్రపంచ ఈవీ దినోత్సవ వేళ భారతదేశంలో మొట్టమొదటి ఈవీ చార్జింగ్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని హైదరాబాద్లో అతి ముఖ్యమైన వాణిజ్య ప్రాంతం జూబ్లీహిల్స్లో ప్రారంభించించడం ద్వారా ఈవీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నట్లు లయన్ చార్జ్ ఈవీ వెల్లడించింది. ఈ వినూత్నమైన ఈవీ చార్జింగ్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రొహిబిషన్–ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక, ఆర్కియాలజీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్, కొండగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈసందర్భంగా లయన్ చార్జ్ ఫౌండర్ అండ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గుత్తా వెంకట సాయివీర్ రెడ్డి మాట్లాడుతూ…ఈ చార్జింగ్ కేంద్రం ఈవీ ప్రియులకు ఓ అవగాహన వేదికగా పనిచేయనుందన్నారు. ఈవీ విప్లవం, వాటి పనితీరు, బ్యాటరీ సాంకేతికతలను గురించి మరింతగా వీరు తెలుసుకోవచ్చన్నారు. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రం ప్రారంభించడానికి ప్రధాన కారణం వినియోగదారులకు అవగాహన మెరుగుపరచడం, ఈవీ చార్జింగ్ పట్ల ఉన్న అపోహలను పోగొట్టడమన్నారు. అదే సమయంలో ఈవీ చార్జింగ్ సొంతం చేసుకోవడంలోని సౌకర్యం గురించి తెలపడమన్నారు.