హైదరాబాద్ జంట నగరాలను చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కెటిఆర్. నెక్లెస్‌రోడ్‌లో 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని అభిప్రాయపడ్డారునగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కలిసి ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్త సేకరణ కోసం పంపిణీ చేసి బుట్టలను వినియోగం తెచ్చి ఇండ్ల వద్దకు వచ్చే ఆటో డ్రైవర్లకు అందజేయాలని కోరారు. నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్న జీహెచ్‌ఎంసీ పాలకవర్గాన్ని, అధికార యంత్రాంగం, సిబ్బంది మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement