తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడుల సాధన కోసం మంత్రి కేటీఆర్ బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపారు. ఫార్మా, లైఫ్‌సెన్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్, ఫిష్ ప్రాసెసింగ్, ఐటీ కంపెనీలు రాష్ట్రంలో రూ.8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. ఈ మేరకు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement