హైదరాబాద్ : అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అటవీ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే మనకే ప్రకృతి అవసరమని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునః నిర్వచించటానికి ఇదే సరైన సమయం అని అన్నారు. లేకపోతే భవిష్యత్తులో గాలి, నీరు దొరకని పరిస్థుతులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.మనల్ని మనం రక్షించుకోవడానికిగాను, మనం భూగ్రహాన్ని రక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. భూమిపై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, అందుకే తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలవాలని ఆయన సూచించార
Advertisement
తాజా వార్తలు
Advertisement