తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని నిప్పులు చెరిగారు. ఆ కుట్రలో భాగంగానే ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను తనిఖీ చేస్తుందన్నారు. కూలీలకు సంబంధించిన రూ.10 వేల కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకత్వం కుట్ర చేస్తుందని మంత్రి హరీశ్ రావు లేఖలో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement